Batukammanews
Newspaper Banner
Date of Publish : 17 May 2025, 1:02 pm Posted by : ramakrishna

నెలాఖరున లేదా మొదటి వారంలో మంత్రివర్గ విస్తరణ

  • దేశానికి తెలంగాణ రోల్ మోడల్
  • ఉనికి కోసమే బీఆర్ఎస్ నేతల ఆరాటం
  • బీఆర్ఎస్ లో కవిత, కేటీఆర్, హరీష్ రావు పోరుతో మూడు ముక్కలాట
  • మతం పేరు చెప్పి బీజేపీ రాజకీయ లబ్ది

. పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ హాట్ కామెంట్స్
నిజమాబాద్, బతుకమ్మ: ఈ నెలాఖరున లేదా జూన్ మొదటి వారంలో మంత్రి వర్గ విస్తరణ ఉండే అవకాశం ఉంటుందని, వివిధ సమీకరణాల కారణంగానే జాప్యం జరుగుతోందని పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. దేశానికి తెలంగాణ రోల్ మోడల్ గా నిలిచిందని పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన నగరంలోని కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో శనివారం విలేకరులతో మాట్లాడారు. బీఆర్ఎస్ నేతలు ఉనికి కోసమే ఆరాటపడుతున్నారని అన్నారు. బీఆర్ఎస్ లో కవిత, కేటీఆర్, హరీష్ రావు పోరుతో మూడు ముక్కలాట నడుస్తోందని అన్నారు. ఈ మూడు ముక్కలాట పోరు తాళలేక కేసిఆర్ ఫాం హౌస్ కే పరిమితమయ్యిండని విమర్శించారు.  వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణ రాజకీయ ముఖ చిత్రంలో బిఆర్ఎస్ పార్టీ కనపడదని అన్నారు.  మతం పేరిట రెచ్చగొట్టి రాజకీయంగా లబ్ధి పొందడం బీజేపీకి పరిపాటిగా మారిందని పేర్కొన్నారు.  ఆపరేషన్ సిందూర్ పై ప్రధాని మోదీ వైఖరితో ఆయన సత్తా ఏంటో తేలిపోయిందన్నారు.  భారత్ – పాక్ వార్ లో అమెరికా జోక్యంపై దేశ ప్రజలు జీర్ణించుకోలేని పరిస్థితి నెలకొందని అన్నారు. యుద్దం తో సాధించింది ఏమిటి? కోల్పోయింది ఏమిటి? అన్న విషయంపై కేంద్రం క్లారిటీ ఇవ్వడం లేదన్నారు. ఇచ్చిన హామీల అమలుకు అనుగుణంగా పాలన అందిస్తున్నామని తెలిపారు.  సిఎం రేవంత్,మంత్రులు సఖ్యతతో ప్రజాభిప్రాయానికి మేరకు పాలన సాగిస్తున్నామని పేర్కొన్నారు.  సిఎం రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ ఆలోచన మేరకు కుల సర్వే నిర్వహించి చరిత్ర సృష్టించారని తెలిపారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కిందన్నారు. కేంద్రం జనగణన తో పాటు కులగణన చేస్తామని ప్రకటించడం రాహుల్ గాంధీ,కాంగ్రెస్ పార్టీ  విజయమని తెలిపారు. సిఎం రేవంత్ రెడ్డి, మంత్రుల పాలనలో తెలంగాణ దేశానికి దిక్సూచిగా మారిందన్నారు.  పార్టీ సీనియర్లకు సముచిత ప్రాధాన్యం కల్పించేలా సలహా మండలి కమిటీ అని తెలిపారు. పార్టీకి – ప్రభుత్వానికి మధ్య వారధిలా పనిచేయడానికి కమిటీ దోహదపడుతుందన్నారు.  రోజువారీ పొలిటికల్ యాక్టివిటీ కోసం పొలిటికల్ అఫైర్స్ కమిటీలను నియమిస్తామని తెలిపారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం సంవిధాన్ బచావో కమిటీ ఏర్పాటు చేసి కొంత మంది సీనియర్లకు, శాసన సభ్యులకు చోటు కల్పిస్తామని తెలిపారు. 2026లో డిలిమిటేషన్ దృష్ట్యా పార్టీకి సలహాలు ,సూచనల కోసం డిలిమిటేషన్ కమిటీని నియమిస్తామన్నారు. పార్టీలోని కొత్త , పాత నేతల మధ్య సమన్వయం పై ప్రత్యేక దృష్టి పెడతామన్నారు. ఈనెల 26 లేదా 27 తేదీల్లో పీసీసీ కార్యవర్గం ఖరారయ్యే అవకాశం ఉందని తెలిపారు. మహిళా కాంగ్రెస్ ఆందోళన సాధారణమైందేనని, కాంగ్రెస్ లో మహిళలకు ఉన్నంత ప్రాధాన్యత మరే పార్టీల్లో లేదన్నారు. మంత్రలందరూ కలిసే ఉన్నారని, కొందరు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలను వక్రీకరించి సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేశారని తెలిపారు. అసత్య ప్రచారం పై మంత్రి కొండా సురేఖ సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు చేయబోతున్నారని పేర్కొన్నారు.  బీజేపీ, బిఆర్ఎస్ నేతలు దిగజారి కాంగ్రెస్ పై  సోషల్ మీడియాలో విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మధ్యప్రదేశ్ తరహాలో సోషల్ మిడియాలో విష ప్రచారాన్ని అడ్డుకునేందుకు క్షుణ్ణంగా అధ్యయనం చేసి చట్టం తెచ్చే యోచన చేస్తున్నామని తెలిపారు. తెలంగాణలో సీఎం మార్పు అనేది ప్రతిపక్షాల కల్పిత కుట్ర అని అన్నారు. ఉచిత బస్సు మొదలు సన్న బియ్యం పంపిణీ వరకు కాంగ్రెస్ ప్రభుత్వం బృహత్తర కార్యకమాలను చేపట్టిందని తెలిపారు. పదేళ్ల బిఆర్ఎస్ పాలనలో కుంటుపడిన విద్య, వైద్య రంగాలను మెరుగుపరుస్తున్నామని పేర్కొన్నారు. విద్యా పరంగా రూ. 200 కోట్లతో అధునాతన , సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ను ఏర్పాటు చేయబోతున్నామని స్పష్టం చేశారు.  వైద్యం పరంగా ప్రైమరీ హెల్త్ సెంటర్ నుంచి నిమ్స్ వరకు ప్రక్షాళన చేసి బలోపేతం చేస్తున్నామన్నారు.  కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 65 వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చిందని తెలిపారు. ఈ సమావేశంలో రైతు కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్, నుడా చైర్మన్  కేశవేణు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

cabinet-expansion-at-the-end-of-the-month-or-in-the-first-week