సమగ్ర కులగణనకు కేబినెట్ ఆమోదం

హైదరాబాద్, బతుకమ్మ :  సమగ్ర కులగణన, ఎస్సీ వర్గీకరణ నివేదికలకు తెలంగాణ మంత్రివర్గం మంగళవారం ఆమోదం తెలిపింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన అసెంబ్లీహాల్లో రెండు గంటల పాటు కేబినెట్ భేటీ కొనసాగింది. ఈనివేదికలను మధ్యాహ్నం 2గంటలకు అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదించనున్నారు.