- శ్రీరాఘవేంద్ర స్వామి
వేల్పూర్, బతుకమ్మ : అత్యంత పవిత్రమైన ఏకాదశి వ్రతం చేసే వారి జన్మ ధన్యమని, ఈ ఏకాదశి వ్రతం చేయడం వల్ల జ్ఞానెంద్రియాలు, కర్మేంద్రియాలు తమ అదీనంలోకి వస్తాయని ఆధ్యాత్మిక వక్త శ్రీ రాఘవేంద్ర స్వామి అన్నారు. వేల్పూర్ ర శివారులో గల శ్రీ గోవిందసాయి (సాయి బాబా) దేవాలయం ప్రాంగణంలో 4వ రోజైన ఆదివారం నిర్వహించిన సప్త భజన, తొలి ఏకాదశి సందర్భంగా శాస్త్రబద్ధంగా గురుపాదుకాపూజ నిర్వహించి,నిరవధికంగా సామూహిక భజనలు చేశారు. వీణను ధరించి గురునామాన్ని జపిస్తు ఏకాదశి పండుగను ఉద్దేశించి ప్రవచనకర్త స్వామిజీ ఆధ్యాత్మిక ప్రసంగం చేశారు. విష్ణు విగ్రహాన్ని పూజించి,విష్ణు సహస్రనామ పారాయణం చేసి “ఓం నమో భగవతే వాసుదేవాయ” అనే మంత్రాన్ని జపించాలని సూచించారు. పండ్లు, పూలు,స్వీట్లు, పంచామృతాన్ని అందించి,పేదలకు, బ్రాహ్మణులకు దానాలు చేయ్యాలన్నారు. ఏకాదశి ఉపవాసం నుండి సాత్విక ఆహారం తీసుకోవాలని, ఏకాదశి రోజున సానుకూల ఆలోచనలను మనస్సులో ఉంచుకుని ఆధ్యాత్మిక కార్యములో నిమగ్నులై ఉండాలన్నారు. ఏకాదశి ప్రజలలో ఉండే చైతన్యానికి ప్రతీక. ఏకాదశి అంటే 11. అంటే 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, మనస్సు కలిపి మొత్తం 11. వీటిని మనిషి తన ఆధీనంలోకి తీసుకువచ్చి వాటి నన్నిటిని ఒకటిగా చేసి అప్పుడు దేవునికి నివేదించాలన్నారు. దీనివలన మనిషికి సహజంగా అలవాడే బద్ధకం దూరమవుతుందని, రోగాలు దరిచేరకుండా ఉండి, ఇంద్రియ నిగ్రహం శక్తి పెరుగుతుందన్నారు.