. . . మంత్రిని ప్రశ్నించిన ఆర్టీసీ డ్రైవర్ అశోక్
. . . విధుల నుంచి తొలగించినట్టు ప్రకటించిన ఆర్ఎం
జగిత్యాల, బతుకమ్మ:
ఒక్కటే మాట… ప్రభుత్వాన్ని ప్రశ్నించడం అతని ఉద్యోగానికి ఎసరు తెచ్చింది. చేసే టెంపరరీ ఉద్యోగం నుంచి అతడిని తొలిగించడమే కాకుండా విధులకు రావద్ధని ఖరాఖండిగా చేప్పేశారట….
కేంద్రం పెంచిన ఇంధన ధరలకు వ్యతిరేకంగా రాష్ట్ర మంత్రి అడ్లూర్ లక్ష్మణ్, ఎమ్మెల్యేలు జగిత్యా ల జిల్లా కేంద్రంలో ధర్నా నిర్వహించారు. అదే సమయంలో అదే రూట్ లో బస్సు నడుపుతున్న జగిత్యాల ఆర్టిసీ డిపో హైర్ బస్ డ్రైవర్ అశోక్ ముందు వడ్లు, మక్కలు కొనండి సార్ పెట్రోల్, డిజీల్ ధరల పెరుగుదలపై తరువాత మాట్లాడోచ్చు అంటు కామెంట్ చేశారు. ఈ కామెంట్ ను సీరియస్ గా తీసుకోని ఆర్టిసి రీజినల్ మేనేజర్ కార్యాలయం నుంచి డ్రైవర్ ఆశోక్ కు రిమూవల్ సర్వీస్ అనే లేటర్ జారీ చేసి డ్యూటికి రావద్ధని సూచించినట్టు తెలిసింది.. రైతులు కష్టాలు ఎదుర్కుంటుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదు ముందుగా వడ్లు, మక్కలు కోనండి అని అడిగినందుకు అశోక్ ను ఉద్యోగం నుంచి తీసివేయడం పట్ల ప్రజల్లో ఆగ్రహం వ్యక్తం అవుతుంది. అశోక్ పరిస్థితి చూసి అందరిలో అతడిపట్ల సానుభూతి వ్యక్తం అవుతుంది.

. . . డ్రైవర్ అశోక్ తో ఫోన్లో మాట్లాడిన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్
ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకే ఆర్టీసీ డ్రైవర్ అశోక్‌పై వేటు వేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని జగిత్యాల నియోజకవర్గ బీజేపీ ఇంచార్జీ డాక్టర్ భోగ శ్రావణి అన్నారు. మంగళవారం డ్రైవర్ అశోక్ ను పరామర్శించి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ప్రజా సమస్యలు పరిష్కరించడం లేదని ప్రతి సామాన్య ప్రజలు ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు ఉంటుందని, ఇలా ప్రశ్నించిన ప్రతి వారిని ఇబ్బందులకు గురి చేయడం సరికాదని పేర్కొన్నారు. వెంటనే డ్రైవర్ అశోక్ ను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే విషయం తెలుసుకున్న నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ స్థానిక నాయకుల సహకారంతో డ్రైవర్ అశోక్ తో సెల్ ఫోన్ ద్వారా మాట్లాడారు. పరిస్థితిపై పరిశీలన జరిపారు. పార్టీ తరపున, వ్యక్తిగతంగా అన్ని విధాలుగా అండగా ఉంటామని పేర్కొన్నారు. తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని, తమ ప్రభుత్వం ఏర్పాటు జరిగిన వెంటనే డ్రైవర్ అశోక్ ఉద్యోగాన్ని రెగ్యులరైజ్ చేస్తామని పేర్కొన్నారు. ధైర్యంగా ఉండాలని, తాము అండగా ఉంటామని హామీనిచ్చారు.
