ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ పంపిణీ
రుద్రూర్, బతుకమ్మ : వేసవి తీవ్రత అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో రుద్రూర్ మండలంలోని రాయకూర్ గ్రామంలో ఉపాధి హామీ పథకం పనులు చేస్తున్న ఉపాధి కూలీలకు రాయకూర్ గ్రామ ఇంచార్జ్ సర్పంచ్ అర్చన అనిల్ పటేల్ బుధవారం మజ్జిగ అందజేశారు. ఈ సందర్భంగా ఇంచార్జ్ సర్పంచ్ అర్చన మాట్లాడుతూ.. ఉపాధి కూలీలు ఎంతో కష్టపడి ఎండలో ఉపాధి పనులు చేస్తున్నారని వారి దాహార్తిని తీర్చడానికి, వడదెబ్బ బారిన పడకుండా పని ప్రదేశంలో కూలీలకు ఉపశమనం కలిగించేందుకు తాము వారికి మజ్జిగను అందజేయడం...