రుద్రూర్, బతుకమ్మ :
వేసవి తీవ్రత అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో రుద్రూర్ మండలంలోని రాయకూర్ గ్రామంలో ఉపాధి హామీ పథకం పనులు చేస్తున్న ఉపాధి కూలీలకు రాయకూర్ గ్రామ ఇంచార్జ్ సర్పంచ్ అర్చన అనిల్ పటేల్ బుధవారం మజ్జిగ అందజేశారు. ఈ సందర్భంగా ఇంచార్జ్ సర్పంచ్ అర్చన మాట్లాడుతూ.. ఉపాధి కూలీలు ఎంతో కష్టపడి ఎండలో ఉపాధి పనులు చేస్తున్నారని వారి దాహార్తిని తీర్చడానికి, వడదెబ్బ బారిన పడకుండా పని ప్రదేశంలో కూలీలకు ఉపశమనం కలిగించేందుకు తాము వారికి మజ్జిగను అందజేయడం జరిగిందని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో బాలగంగాధర్, ఎంపీ ఓ అరవింద్, ఏపీవో రాజేశ్వర్, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ అనిల్ పటేల్, వార్డు మెంబర్లు కాంతపు గంగారం, కురుమే గంగారం, ముకుందొల్ల బాబు, కోర్బశాం, కాంతపు సాయిలు, ఫీల్డ్ అసిస్టెంట్ సురేష్ తదితరులు పాల్గొన్నారు.