Batukammanews
Newspaper Banner
Date of Publish : 16 January 2025, 8:37 pm Posted by : ramakrishna

బుస్సాపూర్ హత్య కేసును ఛేదించిన పోలీసులు

బతుకమ్మ,మెండోరా: మెండోరా మండలంలో జరిగిన దారుణ హత్య కేసును పోలీసులు చేదించినట్లు ఆర్మూర్ రూరల్ సిఐ శ్రీధర్ రెడ్డి అన్నారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం మంగళవారం బుస్సాపుర్ గ్రామంలో హత్యకు గురైన దిలీప్ శర్మ కేసును చేదించడం జరిగిందని.హత్య చేసిన నిందితులు బుస్సాపుర్ గ్రామానికి చెందిన శ్రీకర్, కొడిచర్ల గ్రామానికి చెందిన అక్షయ ఇద్దరు కలిసి దిలీప్ శర్మను హత్యచేశారని తెలిపారు.దిలీప్ శర్మ, శ్రీకర్ ఇద్దరు మిత్రులని మొదట దిలీప్ శర్మకు అక్షయ పరిచయం అయ్యిందని తెలిపారు. తరవాత శ్రీకర్ తో అక్షయ పరిచయం పెట్టుకుందని ఇలా ఇద్దరితో పరిచయం ఏర్పచుకున్న అక్షయ చివరికి ఒకరిని అడ్డు తొలగించుకోవాలని శ్రీకర్ తో కలిసి అక్షయ దిలీప్ శర్మ హత్య చేశారని అన్నారు.మృతుడు దిలీప్ శర్మ, శ్రీకర్ ఇద్దరు మద్యం సేవించారని ఇద్దరి మధ్య కాస్త అక్షయ విషయంలో గొడవ కాగా దిలీప్ శర్మ శ్రీకర్ తో అక్షయ ను వదులుకోవాలని శ్రీకర్ తో దిలీప్ శర్మ చెప్పగానే శ్రీకర్ అక్షయ కు ఫోన్ చేసి నిన్ను వదులుకోవాలని గొడవ చేస్తున్నాడని వచ్చి ఏదో ఒక్కటి తేల్చుకుందామని ఇద్దరు వచ్చి దిలీప్ శర్మ ని హత్య చేశారని తెలిపారు. నిందుతులు ఇద్దరినీ అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించామని తెలిపారు. హత్య కేసును ఛేదించిన మెండోర, బాల్కొండ, ముఫ్కల్ ఎస్సైలు నారాయణ, నరేష్ర, జినీకాంత్ లను, పోలీస్ సిబ్బందిని సిఐ శ్రీధర్ రెడ్డి అభినందించారు.