Batukammanews
Newspaper Banner
Date of Publish : 16 December 2024, 10:03 pm Posted by : ramakrishna

దుబాయ్ లో  బ్రేక్ ఫెయిలై బస్సు బోల్తా 

  • పలువురు లేబర్ల మృత్యువాత, మరి కొందరికి తీవ్రగాయాలు 

నిజామాబాద్ ప్రతినిధి, బతుకమ్మ : యునైటెడ్ అరబ్ ఏమేరెడ్స్(దుబాయ్) లోని దర్వేష్ కంపనికి చెందిన బస్సు బ్రేక్ ఫెయిల్ అవ్వడంతో ఘోర దుర్ఘటన చోటుచేసుకొంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు సోమవారం జరిగిన ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.దుబాయ్ లోని అజమాన్ వర్క్ సైట్ నుండి లేబర్ ను కుర్ఫాఖాన్ కు తీసుకొని బస్సులో వస్తుండగా మార్గమధ్యలోని ఓ రౌండ్ అప్ బోర్డు వద్ద సడన్ గా బస్సు బ్రేక్ ఫెయిల్ కాగా బస్సు బోల్తా పడింది. బస్ లో సుమారు 75 మంది దర్మేష్ కంపనికి చెందిన కార్మికులు ఉన్నారు. వారిలో కొందరు అక్కడికక్కడే మరణించగా, కొందరికి తీవ్ర గాయాలు అయినట్లు సమాచారం. ఘటన సమాచారం అందుకొన్న దుబాయ్ కుర్ఫాఖాన్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలను చేపట్టారు.  బస్ లో ప్రయాణిస్తున్న క్షతగాత్రుల ఐడెంటి కార్డుల ఆధారంగా వివరాలను కంపెనీకి సమాచారం ఇస్తున్నట్లు తెలిసింది. ఈ దుర్ఘటనలో ఎందరు మృతి చెందారో, ఎందరు తీవ్ర గాయల పాలయ్యారో తెలిసి రాలేదు. వివరాలను సంబంధిత కంపెనీ వారు అధికారికంగా ప్రకటించాల్సి ఉండగా ఈ దర్మేష్ కంపెనీలో తెలంగాణకు చెందిన వారు ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాకు చెందిన వారు పని చేస్తుండగా వారి కుటుంబ సభ్యులు ఆందోళనకు గురి అవుతున్నారు.