Batukammanews
Newspaper Banner
Date of Publish : 24 March 2026, 1:22 pm Posted by : ramakrishna

రోడ్డు ప్రమాదంలో బస్సు లారీ ఢీ

 

. . .  పలువురికి తీవ్ర గాయాలు..

 

 రుద్రూర్, బతుకమ్మ :

 

రుద్రూర్ మండల కేంద్రంలో జవహర్ నగర్ కాలనీ వద్ద మంగళవారం బస్సు – లారీ ఢీ కొన్నాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం బోధన్ నుండి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఎక్స్ ప్రెస్  బస్సు, వర్ని నుండి బోధన్ వైపు వస్తున్న లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇరువురు డ్రైవర్లతో పాటు బస్సులో ఉన్న ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే 108 అంబులెన్సులో బోధన్ ఆసుపత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న ఎస్సై సాయన్న ఘటన స్థలానికి చేరుకొని ప్రమాదం జరిగిన ఘటనపై వివరాలు సేకరించారు.

Bus collides with lorry in road accident