Batukammanews
Newspaper Banner
Date of Publish : 27 March 2025, 7:00 pm Posted by : ramakrishna

మండల యువజన అధ్యక్షులుగా బుర్ర రామకృష్ణ గౌడ్

లింగంపేట్, బతుకమ్మ : లింగంపేట్ మండల యువజన అధ్యక్షులుగా బుర్ర రామకృష్ణ గౌడ్ ని నియమించారు. లింగంపేట్ మండల యూత్ అధ్యక్షుల సమావేశంలో గురువారం నియోజకవర్గ అధ్యక్షులు సర్దార్ నాయక్ అధ్యక్షతన మండల అధ్యక్షున్ని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా బుర్ర రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ తనను నమ్మి తనపై నమ్మకం తో లింగంపేట్ మండల యూవ జన కాంగ్రెస్ అధ్యక్షునిగ  బాధ్యతలు ఇచ్చినందుకు ఎల్లారెడ్డి నియోజకవర్గం శాసనసభ్యులు మదన్ మోహన్ కు, జిల్లా అధ్యక్షులు మధుసూదన్ రెడ్డికి ప్రతేక్య ధన్యవాదాలు తెలిపారు.  పార్టీని, యువజన కాంగ్రెస్ ని బలోపేతం చేస్తానని, స్థానిక ఎన్నికల్లోకూడా ప్రతి గ్రామంలో కమిటీలు వేసి అందర్నీ ప్రోత్సహించే విధంగా పనిచేస్తానని తెలిపారు.