కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మ దహనం
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : సిపిఎం, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఎన్టీఆర్ చౌరస్తా వద్ద కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. రిజర్వేషన్ల అమలుకు అన్ని సంఘాలు, రాజకీయ పార్టీలతో సహా తెలంగాణ బంధుకు పిలుపునిచ్చాయని తెలిపారు. సిపిఎం పార్టీ స్వాగతిస్తూ.. మద్దతు కూడా తెలిపిందన్నారు. బిజెపి కేంద్రంలో అధికారంలో ఉండి బీసీ రిజర్వేషన్లను అడ్డుకుంటుందో ఆ బిజెపి కూడా పాల్గొనటం ఆశ్చర్యకరం అన్నారు. అంటే దొంగే దొంగ అని అరుస్తున్నట్టు ఉందన్నారు. సిపిఎం పార్టీ వృత్తి సంఘాలు ...