Batukammanews
Newspaper Banner
Date of Publish : 18 October 2025, 7:19 pm Posted by : ramakrishna

కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మ దహనం

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : సిపిఎం, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఎన్టీఆర్ చౌరస్తా వద్ద కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. రిజర్వేషన్ల అమలుకు అన్ని సంఘాలు, రాజకీయ పార్టీలతో సహా తెలంగాణ బంధుకు పిలుపునిచ్చాయని తెలిపారు. సిపిఎం పార్టీ స్వాగతిస్తూ..  మద్దతు కూడా తెలిపిందన్నారు. బిజెపి కేంద్రంలో అధికారంలో ఉండి బీసీ రిజర్వేషన్లను అడ్డుకుంటుందో ఆ బిజెపి కూడా పాల్గొనటం ఆశ్చర్యకరం అన్నారు. అంటే దొంగే దొంగ అని అరుస్తున్నట్టు ఉందన్నారు.  సిపిఎం పార్టీ వృత్తి సంఘాలు  బీసీ రిజర్వేషన్ల ఫైల్ మీద గవర్నర్ సంతకం చేయాలని చలో రాజభవన్ కార్యక్రమం నిర్వహించగా నిర్ధాక్షణంగా అరెస్టు చేశారని తెలిపారు. ఇవన్నీ మర్చిపోయిన బిజెపి బీసీ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో జరుపుతున్న తెలంగాణ బంధుకు జిల్లా స్థాయిలో కానీ రాష్ట్రస్థాయిలో కానీ  బిజెపి వారే ఉన్నారని తెలిపారు. తెలంగాణ అసెంబ్లీ తీర్మానించిన 42 శాతం బీసీ రిజర్వేషన్ల ఫైలు పై గవర్నర్ తో సంతకం పెట్టించాలని, కేంద్ర ప్రభుత్వంతో బీసీ రిజర్వేషన్కు  చట్టబద్ధత తేవాలని డిమాండ్ చేశారు.  ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పెద్ది వెంకట్రాములు, జిల్లా కమిటీ సభ్యులు సుజాత, ఐద్వా సంఘం జిల్లా అధ్యక్షురాలు అడవల అనిత, వృత్తి సంఘాల నాయకులు ఎస్ శేఖర్ గౌడ్, వడ్డెర వృత్తిదారుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఇడగొట్టి వడ్డెన్న, కెవిపిఎస్ జిల్లా అధ్యక్షులు నల్వాల నరసయ్య, విద్యార్థి సంఘం జిల్లా కార్యదర్శి రాచకొండ విగ్నేష్, కార్యకర్తలు భీమశంకర్ రాజు గోవిందు లక్ష్మి రజియ తదితరులు పాల్గొన్నారు.