రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యూనివర్సిటీ ప్రొఫెసర్ల రిటైర్మెంట్ వయసు 60 నుండి 65 సంవత్సరాలకు పెంచడాన్ని నిరసిస్తూ నిజామాబాద్ నగరంలోని దుబ్బా చౌరస్తాలో పీడీఎస్యూ ఆధ్వర్యంలో శనివారం రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ కర్క గణేష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వేలాదిమంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం తమ ఇంటిని, తల్లిదండ్రులను కుటుంబాలను వదిలి ఉద్యోగాల కొరకు కష్టపడి చదువుతున్నారన్నారు. యూనివర్సిటీల్లో బోధన, బోధనేతర సిబ్బంది ఖాళీల...