రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: వర్షాకాలం సీజన్ కు సంబంధించి రైతులకు ఇవ్వాల్సిన రైతు భరోసాను రాష్ర్ట ప్రభుత్వం ఎగ్గొట్టిందని జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ దాదన్నగారి విఠల్ రావు, బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు సిర్ప రాజు విమర్శించారు. రాష్ర్ట ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఆదివారం జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఎన్టీఆర్ చౌరస్తాలో ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. రైతులను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలని వారు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు సూదం రవిచందర్, సత్యప్రకాశ్, లింగం,...