ఏబీవీపీ ఆధ్వర్యంలో సీఎం దిష్టిబొమ్మ దహనం
బతుకమ్మ నిజామాబాద్ అర్బన్ : అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఇందూరు శాఖ ఆధ్వర్యంలో నగరంలోని ఎన్టీఆర్ చౌరస్తా వద్ద రాష్ట్ర ముఖ్యమంత్రి దిష్టిబొమ్మ మంగళవారం దహనం చేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రజా పాలన పేరుతో విద్యార్థులను హింసిస్తున్నారని మండిపడ్డారు. బాసర త్రిబుల్ ఐటీలో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఏబీవీపీ విద్యార్థి నాయకులు శాంతియుతంగా ధర్నా నిర్వహిస్తున్న సమయంలో అక్కడ ఉన్న సిఎస్ఓ రమేష్ సెక్యూరిటీ సిబ్బందిని...