Batukammanews
Newspaper Banner
Date of Publish : 12 November 2024, 7:11 pm Posted by : ramakrishna

ఏబీవీపీ ఆధ్వర్యంలో సీఎం దిష్టిబొమ్మ దహనం

బతుకమ్మ నిజామాబాద్ అర్బన్ : అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఇందూరు శాఖ ఆధ్వర్యంలో నగరంలోని ఎన్టీఆర్ చౌరస్తా వద్ద రాష్ట్ర ముఖ్యమంత్రి దిష్టిబొమ్మ మంగళవారం దహనం చేశారు. ఈ సందర్భంగా  ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రజా పాలన పేరుతో విద్యార్థులను హింసిస్తున్నారని మండిపడ్డారు.  బాసర త్రిబుల్ ఐటీలో ఆత్మహత్య చేసుకున్న  విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.  ఏబీవీపీ విద్యార్థి నాయకులు శాంతియుతంగా ధర్నా నిర్వహిస్తున్న సమయంలో అక్కడ ఉన్న సిఎస్ఓ రమేష్ సెక్యూరిటీ సిబ్బందిని ఉసిగొల్పి విద్యార్థి నాయకుల పై తీవ్రంగా దాడి చేయించారని మండిపడ్డారు. అక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బందివిద్యార్థులపై ఇనుప రాడ్లతో, కర్రలతో దాడి చేయడం ఏబీవీపీ తీవ్రంగా ఖండిస్తుందని తెలిపారు. బాసర త్రిబుల్ ఐటీ లో రెండు మూడు సంవత్సరాల నుండి వరుస సంఘటనలు వరుస ఆత్మహత్యలు జరుగుతున్న ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ జాతీయ కార్యవర్గ సభ్యులు శివ, నాయకులు అమరాచారి, సాయికుమార్, ప్రవీణ్, మహేష్, అజయ్, సమీర్, దినేష్, సన్నీ తదితరులు పాల్గొన్నారు.