Batukammanews
Newspaper Banner
Date of Publish : 28 October 2024, 10:33 am Posted by : ramakrishna

తోపుడు బండ్ల దహనం

. జిల్లా కేంద్రంలోని శివాజీ నగర్ లో ఘటన

. పండ్లు విక్రయించే బండ్లకు నిప్పు పెట్టిన అగంతకులు

 నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: 

నిజామాబాద్ నగరంలోని శివాజీ నగర్ లో అగంతకులు తోపుడు బండ్లకు నిప్పు పెట్టారు. ఈ ఘటన  సోమవారం ఉదయం వెలుగు లోకి వచ్చింది.  పండ్లు, కూరగాయలు విక్రయించే చిరు వ్యాపారులు తమ తోపుడు బండ్లను స్థానికంగా శంకర్ భవన్ స్కూల్ వద్ధ రాత్రిపూట నిలిపి ఉంచుతున్నారు. అదివారం రాత్రి అగంతకులు బండ్లకు నిప్పంటించి దహనం చేశారు. వ్యాపారులు ఉదయం వచ్చే సరికి తోపుడు బండ్లు కాలిపోయి ఉండడం కన్నీరుమున్నీరయ్యారు. సీసీ ఫుటేజీలను పరిశీలిస్తే దుండగులు పట్టుబడే అవకాశం ఉంది.

 

Burning of carts