బడ్జెట్ పత్రాల దహనం
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి 30 శాతం నిధులు కేటాయించకుండా కేవలం మొక్కుబడిగా 7.5% నిధులు కేటాయించడాన్ని నిరసిస్తూ పాలిటెక్నిక్ కళాశాలలో పీడీఎస్యూ(ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థుల ఐక్యత) ఆధ్వర్యంలో బుధవారం బడ్జెట్ పత్రాలను దహనం చేశారు. ఈ సందర్భంగా పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ కర్క గణేష్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి అని కేటాయించిన 7.5% నిధులు ఉద్యోగుల జీతాలకు మాత్రమే కేటాయించారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 15% నిధులు కేటాయిస్తామని తెలంగాణ...