రెంజల్, బతుకమ్మ : కేంద్ర ప్రభుత్వ కార్పోరేట్ అనుకూల రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా ఎస్కేయం పిలుపు రెంజల్ మండల్ సాఠాపూర్ చౌరస్తా వద్ద కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రైతులకు రాతపూర్వకంగా ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. వ్యవసాయ ఉత్పత్తులను, మిగిలిన రైతులకు పంచాలి కనీస మద్దతు ధరల చట్టం చేసి అన్ని రాష్ట్రాల్లోనే మండల కేంద్రాల్లోనూ కొనుగోలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. వరి సేకరణ పై తేమ 17 శాతం నుండి 22 శాతం కు పెంచాలన్నారు. రైతులు వ్యవసాయ కార్మికులకు సమగ్ర రుణమాఫీ పథకానికి ప్రకటించాలన్నారు. వినియోగదారులందరికీ 3 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇవ్వాలన్నారు. ఉపాధి హామీ పథకానికి నిధులు పెంచాలని తెలిపారు. ఈ పథకం ద్వారా 200 రోజులు పనికి రోజు కూలి 700 రూపాయలు ఉండేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కౌలు రైతులు వ్యవసాయ కార్మికులకు వృద్ధాప్య పింఛన్ ఇవ్వాలన్నారు. నాలుగు లేబర్ కోడులను రద్దు చేయాలని, కనీస హక్కులు రక్షించాలని తెలిపారు. కేంద్ర బడ్జెట్లో తగ్గించిన ఎరువుల సబ్సిడీని 87 వేల కోట్లు రూపాయలను పునర్దించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అఖిలభారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు గుమ్ముల గంగాధర్, రాష్ట్ర కమిటీ సభ్యులు పుట్టినడిపి నాగన్న, అఖిలభారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు పార్వతి, రాజేశ్వర్, పసుల గోపాల్, మన్నె పోశెట్టి, శ్రీపతి మల్లేష్, జబ్బర్ తదితరులు పాల్గొన్నారు.