Batukammanews
Newspaper Banner
Date of Publish : 16 August 2024, 2:49 pm Posted by : ramakrishna

కేటీఆర్ దిష్టిబొమ్మ దహనం

బతుకమ్మ నిజామాబాద్ సిటీ : నగరంలోని ఎన్టీఆర్ చౌరస్తా వద్ద శుక్రవారం కేటీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తే.. బీఆర్ఎస్ నేత కేటీఆర్ కించపరిచేలా మాట్లాడడం సరికాదన్నారు. మహిళలను అవమానించేలా మాట్లాడడంపై మండిపడ్డారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కించపరుస్తూ కేటీఆర్ వ్యాఖ్యలు చేయడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న మహిళలను కించపరిచేలా గురువారం మాజీ మంత్రి కేటీఆర్ ఉచిత బస్సులు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది వృధా అని అందులో మహిళలు పబ్బు డాన్సులు చేసేలా పనికిస్తాయి తప్ప ప్రజలకు పనిచేయాయని ఆయన అహంకారంగా మాట్లాడడం పట్ల కాంగ్రెస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా మహిళా కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో ఈ సందర్భంగా కేటీఆర్ కు చెప్పులతో బుద్ధి చెప్పి ఆయన దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ ఘటనపై జిల్లాకు చెందిన మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి ఎందుకు స్పందించడం లేదని ఆ పార్టీకి గౌరవం ఏమాత్రం లేదని వారు విమర్శించారు. అనంతరం మాజీ మేయర్ ఆకుల సుజాత మాట్లాడుతూ మహిళలపై అసభ్యకరంగా మాట్లాడిన కేసీఆర్ కేటీఆర్ కు ఎప్పుడైనా నిజామాబాద్ పర్యటనకు వస్తే చెప్పుల దండతో సన్మానం చేస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే మహిళకు గౌరవంగా ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం ఇవ్వడంతో పాటు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్నందుకే ఓర్వలేక కేటీఆర్ మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని దీన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. సీనియర్ నాయకులు గడుగు గంగాధర్, నరాల రత్నాకర్, ఆకుల శ్రీశైలం, ప్రమోద్, ఖయ్యూం, కాంగ్రెస్ మహిళా నగర అధ్యక్షురాలు రేవతి, మల్లికా, అపర్ణ, మీనా తదితరులు పాల్గొన్నారు. నగరంలోని ఎన్టీఆర్ చౌరస్తా వద్ద శుక్రవారం కేటీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తే.. బీఆర్ఎస్ నేత కేటీఆర్ కించపరిచేలా మాట్లాడడం సరికాదన్నారు. మహిళలను అవమానించేలా మాట్లాడడంపై మండిపడ్డారు. కార్యక్రమంలో పీసీసీ ప్రధాన కార్యదర్శి గడుగు గంగాధర్, వేణురాజ్ సమోర్ తదితరులుపాల్గొన్నారు.

Burning effigy of KTR