సీఎం దిష్టిబొమ్మ దహనం
నిజామాబాద్, బతుకమ్మ : నగరంలోని నిఖిల్ సాయి చౌరస్తాలో బుధవారం బీజేవైఎం ఆధ్వర్యంలో సీఎం దిష్టి బొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా బీజేవైఎం జిల్లా అధ్యక్షులు పానుగంటి సతీష్ రెడ్డి మాట్లాడారు. హైదరాబాద్ లోని నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంపై కాంగ్రెస్ నాయకుల దాడికి నిరసనగా డీసీసీ కార్యాలయం ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. బిజెపి నాయకులు, కార్యకర్తలు అంటే చులకనగా చూస్తున్నారని, బిజెపి కార్యకర్తలు తలుచుకుంటే మీయొక్క భవనాలు కూల్చివేయడం ఎంతసేపు కాదని అన్నారు. తమకు సంస్కారం ఉందని, తమ పార్టీ అలాంటి...