Batukammanews
Newspaper Banner
Date of Publish : 03 February 2025, 8:30 pm Posted by : ramakrishna

ప్రధాని, ఆర్థిక మంత్రి దిష్టిబొమ్మల దహనం

 నిజామాబాద్, బతుకమ్మ  :  కేంద్ర బడ్జెట్ లో తెలంగాణపై వివక్ష చూపి నిధుల కేటాయింపులో అన్యాయం చేసినందుకు నిరసనగా పిసిసి ఆదేశాల మేరకు నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కేశ వేణు ఆధ్వర్యంలో పులాంగ్ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నిరసన తెలిపారు. అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దిష్టి బొమ్మలను దహనం చేశారు. ఈ సందర్భంగా కేశ వేణు మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్ లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలంగాణాకు నిధులు ఇవ్వకుండా వివక్ష చూపిందనీతెలంగాణ ప్రజలు పన్నులు కట్టడం లేదా అని ఆయన  ప్రశ్నించారు.రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వం పై ఒత్తిడి తెచి బీజేపీ ఎంపీలు ఇద్దరు మంత్రులు తెలంగాణాకు నిధులు తేవాలనీ,జిల్లాకు పసుపు బోర్డు కేటాయించారు కానీ ఒక్క రూపాయి నిధులు తీసుకురాలేని ఎంపీ అరవింద్ తన మొహం ఎక్కడ పెట్టుకుని నిజామాబాద్ లో తిరుగుతాడు అని కేశ వేణు అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహేర్ బిన్ హందాన్ , జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతారెడ్డి రాజారెడ్డి,రాష్ట్ర ప్రచార కమిటీ మెంబర్ జావేద్ అక్రమ్,పిసిసి కార్యదర్శి రామకృష్ణ,జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు విపుల్ గౌడ్,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు కేశ మహేష్,అబుద్ బిన్ హందాన్,రాష్ట్ర మైనారిటీ ప్రధాన కార్యదర్శి ఉబేద్ బిన్ హందాన్,లవంగ ప్రమోద్,రాష్ట్ర సెల్ కన్వీనర్ ప్రమోద్, వినయ్, జగడం సుమన్,గడుగు రోహిత్, సకినాల శివకుమార్ మహిళా కాంగ్రెస్ నాయకులు పోల ఉష,విజయలక్ష్మి,గాజుల సుజాత,మలైకా బేగం,అపర్ణ ,తదితరులు పాల్గొన్నారు.