విద్యుత్ లైన్ మెన్ ఇంట్లో చోరి

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ నగరంలోని గాజుల్ పేట్ లో విద్యుత్ శాఖలో లైన్ మెన్ గా పనిచేసే అజిత్ సింగ్ ఇంట్లో చోరీ జరిగింది. ఈ విషయం బుధవారం ఉదయం వెలుగు చూసింది. గాజుల్ పేట్ కడ్డా ప్రాంతంలో నివాసం ఉండే అజిత్ సింగ్ కుటుంబ సమేతంగా బంధువుల ఇంటిలో జరిగిన రిసెప్షన్ కు వెళ్లారు. గుర్తు తెలియని వ్యక్తులు అజిత్ సింగ్ ఇంటి తాళాలు పగులగొట్టి, పడక గదిలో బిరువాను ధ్వంసం చేసి ఐదు తులాల బంగారం, రూ.లక్ష వరకు ...