Batukammanews
Newspaper Banner
Date of Publish : 30 November 2024, 11:59 am Posted by : ramakrishna

తాళం వేసిన ఇంట్లో చోరీ

బోధన్, బతుకమ్మ: బోధన్ పట్టణంలోని ఆచన్ పల్లికి చెందిన ఎల్లమ్మ అనే మహిళ ఇంట్లో దుండుగులు శుక్రవారం రాత్రి చోరీకి పాల్పడ్డారు. ఎల్లమ్మ తన ఇంటికి తాళం వేసిన వెళ్లగా, దుండుగులు తాళాన్ని పగులగొట్టి బీరువాలోని ఐదు తులాల బంగారం, నలభై తులాల వెండి, నగదు ఎత్తుకెళ్లారు. బాధితురాలి కొడుకు శంకర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ సీఐ వెంకటనారాయణ తెలిపారు.