తాళం వేసిన ఇంట్లో చోరీ

ఆర్మూర్, బతుకమ్మ : పట్టణంలోని  పెర్కిట్ కు చెందిన తాజుద్దీన్ అనే వ్యక్తి ఇంట్లో దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఎస్టీవో గా విధులు నిర్వర్తిస్తున్న తాజుద్దీన్ ఆసుపత్రికి వెళ్లి తిరిగి వచ్చేలోపే దుండగులు చోరీకి పాల్పడ్డారు.  రూ.లక్ష నగదుతోపాటు పదితులాల బంగారం, ఐదు తులాల వెండి ఎత్తుకెళ్లారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.