Batukammanews
Newspaper Banner
Date of Publish : 03 November 2024, 7:23 pm Posted by : ramakrishna

 నాందేవ్ వాడలో  ఓ ఇంట్లో చోరి

 నిజామాబాద్ క్రైం,  బతుకమ్మ:                                                                                                                                                   

దీపావళి పండగ కోసం ఇంటికి తాళం వేసి సొంతూరు కు వేళితే దొంగలు ఇంటిని దోచేశారు. నిజామాబాద్ నగరంలో జరిగిన చోరి విషయం అదివారం అలస్యంగా వెలుగు చూసింది. నగరంలో నాందేవాడ కు చెందిన దత్తాద్రి తన స్వంత గ్రామం సోలాపూర్ కు తన కుటుంబసభ్యులతో కలసి  ఈ నెల 1 న తన ఇంటికి తాళం వేసి వెళ్లాడు. అదివారం ఉదయం 5:30 గంటలకు ఇంటి ఓనర్ శివాజీ భోస్లె దత్తాద్రి ఇంటి తలుపులు తెరిచి వున్నవి చూసి వారికి ఫోన్ ద్వారా సమాచారం అందించారు. వారు సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చి వారి ఇంటిలో 3 తులాల బంగారు ఆభరణాలు , కొంత నగదు పోయినట్లు ఇంటి ఓనర్ శివాజీ బోస్లె పిర్యాదు ఇవ్వగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్టు  మూడవ టౌన్ ఎస్ఐ తెలిపారు.