Batukammanews
Newspaper Banner
Date of Publish : 24 July 2025, 11:47 am Posted by : ramakrishna

కులాస్ పూర్ లో 11 ఇళ్లలో చోరీ  

నిజామాబాద్, బతుకమ్మ :  నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం కులాస్ గ్రామంలో దొంగల ముఠా బుధవారం అర్ధరాత్రి ఏక కాలంలో 11 ఇళ్లలో చోరీకి పాల్పడింది. ఈఘటన స్థానికంగా కలకలం రేపింది. దుండగులు తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేసుకున్నారు. 5 తులాల బంగారం, 40 తులాల వెండి, రూ. 2.85 లక్షలు చోరీకి గురైనట్లు పోలీసులు గుర్తించారు. ఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.