Batukammanews
Newspaper Banner
Date of Publish : 08 February 2025, 12:00 pm Posted by : ramakrishna

ఆటో నగర్ లో లెక్చరర్ ఇంట్లో చోరి

 

. . . 17 తులాల బంగారం

. . . 40 వేల నగదు చోరి

 నిజామాబాద్ క్రైం, బతుకమ్మ:

నిజామాబాద్ నగరంలో ఆటో నగర్ లో  మైనారిటీ గురుకుల కళాశాల లెక్చరర్ ఇంట్లో భారీ చోరీ జరిగింది. నగరంలోని ధర్మపురి హిల్స్ లోని ట్రీమ్స్ లో లెక్చరర్ గా పనిచేస్తున్న మహ్మద్ ఇలియాస్ ఇంట్లో శనివారం తెల్లవారు జామున చోరీ జరిగింది. ఇలియాస్ శుక్రవారం రాత్రి నైట్ డ్యూటికి వెళ్లగా అతని భార్య బంధువులను పరామర్శించేందుకు ఇంటికి తాళం వేసి వెళ్లగా ఈ చోరీ జరిగింది. గుర్తు తెలియని వ్యక్తి గోడ దూకి ఇంటి తాళం పగులగొట్టి చోరీకి పాల్పడ్డారు. బీరువాలోని 17 తులాల బంగారు నగలు, రూ.40 వేల నగధు చోరికి పాల్పడ్డారు. ఆగంతకుడు ఇంట్లో ప్రవేశం సంబంధించిన చిత్రాలు సిసి టివి కెమెరాలో నిక్షిప్తమయ్యాయి. భాధితుడు శనివారం ఉదయం విధులు ముగించుకుని ఇంటికి రాగా చోరి విషయం వెలుగు చూసింది. స్థానిక ఆరవ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. నగరంలోని ఆరవ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో  వరుస చోరీలు కలవరపెడుతున్నాయి. గత కొన్ని రోజులుగా జరిగిన చోరిలు ఇప్పటి వరకు రికవరి లేదు దొంగలు దొరకలేదు బాధితులు చెబుతున్నారు.

Burglary at lecturer's house in Auto Nagar