Batukammanews
Newspaper Banner
Date of Publish : 09 June 2026, 3:59 pm Posted by : ramakrishna

రిటైర్డ్ జేసీ ఇంట్లో దొంగలు పడ్డారు

 

. . .  లాకర్ ను ఎత్తుకెళ్లిన అగంతకులు

 నిజామాబాద్ క్రైం, బతుకమ్మ:

నిజామాబాద్ నగరంలో భారీ చోరీ జరిగింది. సుభాష్ నగరంలో రిటైర్డ్ అదనపు కలెక్టర్ రవి కుమార్ ఇంట్లో దొంగలు పడ్డారు. జేసీ రవికుమార్ ఇంటికి తాళం వేసి హైదరాబాద్ వెళ్లగా సోమవారం రాత్రి ఇంటి తాళాలు పగులగొట్టి చోరీకి పాల్పడ్డారు. ఇంటికి తాళం వేసి ఉండటంతో దొంగలు బైక్ పై దర్జాగా వచ్చి చోరీ చేశారు. పడక గదిలో కప్ బోర్డులలో, బీరువాలలో వేతికారు. అక్కడ ఏమి దొరక్కపోవడంతో అక్కడ ఉన్న ఐరన్ సేఫ్( లాకర్) ను ఎత్తుకెళ్లారు. అ ఇంట్లో ఉన్న సీసీ కెమెరా డివిఆర్ ను సైతం ఎత్తుకెళ్ళారు. ముందు రెక్కీ నిర్వహించి పక్కా ప్లాన్ ప్రకారం చోరీ చేసినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. లాకర్ లో దాదాపు 30 తులాల బంగారం, నగదు ఉన్నట్లు సమాచారం. భారీ చోరీ జరిగిన విషయం మంగళవారం ఉదయం ఇరుగుపొరుగు వారు తెలుపడంతో వెలుగులోకి వచ్చింది. ఘటన స్థలాన్ని పోలీసులు చేరుకుని విచారణ ప్రారంభించారు. క్లూస్ టీం ఆధ్వర్యంలో అనవాళ్లు, వేలిముద్రలను సేకరించారు. గతంలో సుభాష్ నగర్ జడ్జి  ఇంట్లో జరిగిన చోరీ కేసు లో దొంగలు దొరకని పరిస్థితి ఉంది.

Burglars broke into the retired JC's house