Batukammanews
Newspaper Banner
Date of Publish : 04 November 2024, 4:41 pm Posted by : ramakrishna

కట్టారు.. పేరు మరిచారు..

  • – ఇంత నిర్లక్ష్యమా?
  • – ప్రైమరి పాఠశాలలో సౌకర్యలు కరువు
  • – ఇబ్బందులు ఎదుర్కొంటున్న విద్యార్థులు

రుద్రూర్ (వర్ని), బతుకమ్మ : ప్రభుత్వ పాఠశాలల పై ఇంత నిర్లక్ష్యమా?.. అని పలువురు ప్రశ్నించుకుంటున్నారు. వర్ని మండల కేంద్రంలోని మల్లారం గ్రామంలో గల ప్రైమరీ పాఠశాలను కట్టారు.. కానీ పేరు వ్రాయడం మరిచారు. దీంతో ఇది పాఠశాలనేనా లేక అంగన్వాడీ కేంద్రమా అని అర్థం కానీ పరిస్థితి నెలకొందని పలువురు ప్రశ్నించుకుంటున్నారు. అదేవిధంగా ప్రైమరీ పాఠశాలలో సరైన సౌకర్యాలు అయిన మరుగుదొడ్లు, వంట గది లేవని దింతో పాఠశాల ఉపాధ్యాయురాలు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. మరుగుదొడ్లు, వంట గది కొరకు నిర్మాణ పనులు చేపట్టారు కానీ కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వలన ఆ పనులు అర్థంతరంగా నిలిచిపోయాయి. ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి ప్రైమరి పాఠశాలలో సౌకర్యాలు కల్పించాలని ఉపాధ్యాయురాలు, విద్యార్థులు, గ్రామస్తులు కోరారు.

Built.. forgot the name..