తరగతి గదిలోనే దేశ భవిష్యత్ నిర్మాణం

జుక్కల్, బతుకమ్మ : దేశ భవిష్యత్ తరగతి గదిలో నిర్మాణమవుతుందని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు అన్నారు. పెద్ద కొడప్ గల్ ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన బాలల దినోత్సవం వేడుకల్లో ఎమ్మెల్యే దంపతులు పాల్గొన్నారు. విద్యార్థులకు బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు  కుల,మత,వర్గ బేధాలు లేకుండా విద్యార్థులు అందరూ సోదర భావంతో మెలగాలని సూచించారు. నేటి బాలలే రేపటి పౌరులని, వారి హక్కులను కాపాడటం, బాధ్యత గల పౌరులుగా వారిని తీర్చిదిద్దడం మన బాధ్యత అని అన్నారు. బాలల హక్కులను కాపాడేందుకు సంకల్పం తీసుకుని,...