బతుకమ్మ భిక్కనూరు: భిక్కనూరు పట్టణంలోని హరిజనవాడ కాలనీలో ప్రమాదవశాత్తు బుధవారం విద్యుదాఘాతానికి గేదె మృతి చెందింది. తన వ్యవసాయ పొలంలో మేతమేస్తుండగా విద్యుత్ వైర్లు తగిలి గేదె చనిపోయిందని బాధితుడు మహమ్మద్ ఖాదిర్ తెలిపాడు. సంఘటన స్థలానికి పశువైద్యాధికారి దేవేందర్ చేరుకొని గేదెకు పంచనామా నిర్వహించి విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం తెలియజేశారు. విద్యుత్ శాఖ అధికారులు స్పందించి న్యాయం చేయాలని బాధితుడు కోరాడు.