Batukammanews
Newspaper Banner
Date of Publish : 22 October 2025, 6:35 pm Posted by : ramakrishna

ఆర్మూర్ లో ఘనంగా బౌద్ధ దీపావళి

ఆర్మూర్, బతుకమ్మ: ఆర్మూర్ సిటీలో గత 5ఏళ్ల నుంచి “బౌద్ధ దీపావళి” ని హోసింగ్ బోర్డు పార్క్ లో పలు బీసీ,ఎస్సి, ఎస్టీ సంఘాలచే ఘనంగా నిర్వహించారు. బి.ఎస్.ఐ సంస్థకి చెందిన చిన్నారి తార పవార్ త్రిశరణం పంచశీల పఠనంతో ప్రారంభమైంది. దళిత ఐక్య సంఘటన ప్రముఖులు డాక్టర్ జి.జి రాం (న్యాయవాది) దీపావళి ఉత్సవం ప్రస్తావన చేశారు. తదుపరి అంబేడ్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు ఇత్వర్పేట్ లింగన్న, ధర్మ సమాజ్ పార్టీ నాయకులు ఉమేష్ మహారాజ్ మాట్లాడుతూ 7ఏళ్ల తర్వాత సిద్ధార్థడు జ్ఞనోదయం పొంది తిరిగి కార్తీక అమావాస్య రోజున కపిలవస్తుకు వచ్చే సందర్బంగా నగరంలోని ప్రజలందరూ వేల దీపాలతో ఆయనకు స్వాగతం పలికిన రోజె “బౌద్ధ దీపావళి”గా చరిత్ర పుటలాల్లో కేక్కిందన్నారు. అనంతరం సామ్రాట్ అశోకుడు 84వేల బౌద్ధ స్తూపాలు అరామాలు చైత్యాలు నిర్మించి వాటిని లక్షల దీపాలతో ప్రారంభించిన రోజు కూడా కార్తీక అమావాస్య దినం. ఐతే కాలక్రమేణా మనువాదులు దానిని “వైదిక దీపావళి”గా మార్చేశారు. ఇప్పుడైతే “కమర్శియల్ పండుగా” మార్చివేశారని ఆవేదన చెందారు. ఏవైఎస్ బాల్కొండ అధ్యక్షులు దేవ పద్మారావు మాట్లాడుతూ దీపం జ్ఞానానికి ప్రతీక. అజ్ఞాన చీకటిని తోలగించి విజ్ఞానం వైపు దారి చూపిన బౌద్ధ ధర్మం. ఇది మూల భారతీయుల గొప్ప సంస్కృతికి చిహ్నమని కొనియాడారు. “మానవుడు తనకు తాను వికసిస్తూ ఇతరులను వికసింప చెయాలన్న” గౌతముడి మహోన్నత సందేశాన్ని ముందుకు తీసుకెళదామని ఈ సందర్బంగా పిలుపునిచ్చారు. సిటీ ప్రముఖులు గుమ్మడి చంద్రన్న, రాజేశ్వర్, కాపు రాజన్న, వికాస్ పవార్, తిరుపతి నాయి, మల్లూరి రాజరాం, జర్నలిస్టులైన సామ్రాట్ అశోక్, అంగుళి మాల, మామిడి రాజు, మమత మాల, మూలనివాసి మాలజీ  తదితరులు పాల్గొన్నారు.