Batukammanews
Newspaper Banner
Date of Publish : 21 August 2024, 12:53 am Posted by : ramakrishna

డెంగ్యూతో బిటేక్ విద్యార్థి మృతి

బతుకమ్మ, లింగం పేట్ -కామారెడ్డి జిల్లాలో డెంగ్యూతో బిటేక్ విద్యార్థి మృతి చెందాడు. ఈ సంఘటన సోమవారం రాత్రి కామారెడ్డి జిల్లా లింగంపెట్ మండలం బాయంపల్లి తాండాలో చోటు చేసుకుంది. తాండాకు చెందిన పీరేంధర్ (21) సోమవారం ఉదయం తీవ్రజ్వరంతో భాదపడ్డారు. స్థానికంగా లింగంపేట్ లో ఒక ప్రైవేట్ మెడికల్ ప్రాక్టిషనర్ వద్ధ వైధ్యం చేయించుకున్నాడు.రాత్రి జ్వరం తీవ్రం కావడం వాంతులు అవుతుండటంతో పియంపిని సంప్రదించారు. సదరు గ్రామీణ వైధ్యుడు తనకు చేత కాదని కామారెడ్డి తీసుకువేళ్లాలని సూచించారు. కామారెడ్డిలో ప్రైవేట్ దవాఖానలో ఫీరేందర్ యొక్కఆరోగ్య పరిస్థితిని గమనించిన వైధ్యులు హైద్రబాద్ కు రిఫర్ చేయగా అంబులేన్స్ లో తరలిస్తుండగా మృతి చెందాడు. ఫిరేంధర్ ఖమ్మంలో బిటేక్ చదువుతున్నారు. సర్టిఫికేట్లు, కాలేజీ ఫీజు కోసం స్వంత ఉరుకు వచ్చి డెంగ్యూ జ్వరంతో చనిపోయారు. సోమవారం ఉధయం పియంపి వైధ్యుడు డెంగ్యూకు వైధ్యం చేయకుండా రీఫర్ చేసిన బ్రతికేవాడని అందరు అంటున్నారు.