35వ డివిజన్ లో బీటీ రోడ్డు పనులు ప్రారంభం

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :     నగరంలోని 35వ డివిజన్ లోని నాందేవ్ వాడలోని పలు ప్రాంతాల్లో బీటీ రోడ్డు పనులు ప్రారంభమయ్యాయి. బుధవారం డివిజన్ లో ప్రారంభమైన బీటీ రోడ్డు పనులకు స్థానిక తాజామాజీ కార్పొరేటర్ ఎర్రం సుధీర్ కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించారు. డివిజన్ లో సీసీ రోడ్డు లేని ప్రాంతాల్లో బీటీ రోడ్డులు వేయించారు. డివిజన్ లో బీటీ రోడ్డు వేయడంతో కాలనీలో రోడ్లు సుందరంగా మారాయి. దీంతో కాలనీవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.