Batukammanews
Newspaper Banner
Date of Publish : 31 March 2025, 2:32 pm Posted by : ramakrishna

బీఆర్ఎస్ లో చేరిన బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు

బాల్కొండ, బతుకమ్మ: బహుజన సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, బాల్కొండ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి నర్సయ్య, నియోజకవర్గ ఇన్ చార్జి శ్రీనివాస్ తమ అనుచరులతో కలిసి బీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా వారికి మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బీఆర్ఎస్ లో చేరిన వారిలో భీమ్ గల్ తాజామాజీ కౌన్సిలర్ బోర్ల లింగం, సికింద్రాపూర్ పెద్దమ్మ కాడి తండా సర్పంచ్ రమేశ్, మోర్తాడ్ మండల కాంగ్రెస్ నాయకులు తక్కూరి రంజిత్ తదితరులు ఉన్నారు.

BSP district president joins BRS