Batukammanews
Newspaper Banner
Date of Publish : 15 January 2025, 8:46 pm Posted by : ramakrishna

మహనీయుల ఆశయ సాధనే లక్ష్యంగా బీఎస్పి పనిచేస్తుంది

_ బెహన్జి మాయావతి జన్మదిన సందర్భంగా హరిలాల్ నాయక్

_ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ

కామారెడ్డి సిటీ, బతుకమ్మ: బహుజన్ సమాజ్ పార్టీ అధినేత బెహన్జి మాయావతి జన్మదిన సందర్భంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బహుజన్ సమాజ్ పార్టీ కార్యాలయంలో మాయావతి జన్మదిన వేడుకలను బీఎస్పి నాయకులు కేక్ కట్ చేసి ఘనంగా జరుపుకున్నారు. తనంతరం కామారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు బ్రెడ్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. బీఎస్పి జిల్లా అధ్యక్షుడు హరిలాల్ నాయక్ మాట్లాడుతూ.. ఆత్మగౌరవ సమాజాన్ని నిర్మించడం కోసం, బహుజనులను పాలకులుగా మార్చడం కోసం అహర్నిశలు మాయావతి పనిచేస్తున్నారు అని గుర్తు చేశారు. అంబేద్కరిజమే ఊపిరిగా, మహనీయుల ఆశయ సాధనే ఈ లక్ష్యంగా బీఎస్పీ పనిచేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఎస్పి కామారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు కొక్కొండ రాజేందర్, దుంపల రాజేందర్, బేంర్రి భాస్కర్, రోహిదాస్, జీవన్, బాబు, సాయిబాబా, నవీన్, రాములు తదితరులు పాల్గొన్నారు.

BSP aims to achieve the ambition of the nobles