Batukammanews
Newspaper Banner
Date of Publish : 09 July 2026, 6:02 pm Posted by : ramakrishna

గుర్తు తెలియని వ్యక్తి దారుణ హత్య

 

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ:

 

నిజామాబాద్ నగర శివారులోని అర్సపల్లి రైల్వే ట్రాక్ పక్కన గుర్తు తెలియని వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన గురువారం ఉదయం వెలుగు చూసింది.. గుర్తు తెలియని సుమారు 50 ఏళ్ల మగవ్యక్తి ఒంటిపై బట్టలు లేకుండా చనిపోయి ఉండటంతో ముందుగా స్థానికులు రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. రైల్వే పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని విచారిస్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తి తల పై భాగం పగలి పోయి, ఒంటిపై ఉన్న గాయాలు బట్టి ఎక్కడైన హత్య చేసి ట్రాక్ వద్ద పారేసి ఉంటారని అనుమానిస్తున్నారు. ముందుగా స్థానికంగా చనిపోయిన వ్యక్తి గుర్తించేందుకు వాకబు చేశారు. వివిధ పోలీస్ స్టేషన్ లలో మిస్సింగ్ కేసులను పరిశీలించే పనిలో పడ్డారు. చనిపోయిన వ్యక్తి ఎవరు అని గుర్తిస్తే గాని మర్డర్ మిస్టరీ విడేలా లేదు…