వృద్ధురాలి దారుణ హత్య

కామారెడ్డి, బతుకమ్మ :  కామారెడ్డి జిల్లా  లింగంపేట్ మండలం, పోల్కంపేట గ్రామం లో శుక్రవారం  రాత్రి జరిగిన దారుణ ఘటన చోటు చేసుకుంది.  గ్రామానికి చెందిన నేరందుల సులోచన, భర్త విఠల్, కుటుంబ సభ్యులతో దైవ దర్శనానికి తిరుపతికి వెళ్లారు. ఈనేపథ్యంలో   ఇంట్లో ఒంటరిగా ఉన్న వృద్ధురాలిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి బంగారు ఆభరణాలు దోచుకున్నారు.  వృద్ధురాలిని హత్య చేసి పరారయ్యారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.