Batukammanews
Newspaper Banner
Date of Publish : 07 November 2026, 12:35 pm Posted by : ramakrishna

 గాంధారి లో యువతి దారుణ  హత్య

 

 గాంధారి, బతుకమ్మ:

గాంధారి మండల కేంద్రంలోని అంగడి బజార్ ప్రాంతంలో ఒక యువతి హత్యకు గురైంది. ఈ సంఘటన శనివారం ఉదయం వెలుగు చూసింది. హతురాలి ని  కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రానికి చెందిన ఆర్ సి కౌర్ (20) గా గుర్తించారు. ఆర్ సి కౌర్ కొంత కాలంగా ఉపాధికోసం హైదరబాద్ కు వలస వెళ్లింది. ఇటివల తనకు పెళ్లి పిక్స్ కావడంతో అమ్మమ్మ ఊరు బందువులకు పెళ్లి కార్డు ఇచ్చేందుకు వచ్చింది. ఎం జరిగిందో ఏమిటో తెలియదు కానీ ఆర్ సి కౌర్ ను గుర్తు తెలియని వ్యక్తులు కత్తితో పొడిచి చంపారు. ఉదయం సెల్ టవర్ వద్ద యువతి హత్యోదంతం  తెలిసి స్థానికులు గాంధారి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకుని వివరాలు సేకరించారు. ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాస్ రావు , సిఐలు పాటు చుట్టు  ప్రక్కల ప్రాంతాలలో వివరాలు, సిసి టివి పుటేజీ పరిశీలించారు. ఆర్ సి కౌర్ బందువులను విచారిస్తున్నారు.

Brutal murder of a young woman in Gandhari