బిచ్కుందలో తెల్లవారుజామున యువకుడి దారుణ హత్య

స్థానికంగా  కలకలం రేపిన ఘటన బిచ్కుంద, బతుకమ్మ :  కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో బుధవారం తెల్లవారుజామున దారుణం చోటుచేసుకుంది. బిచ్కుంద మండల కేంద్రానికి చెందిన అడికే రమేష్ ను దేవాడ గ్రామానికి చెందిన కాశీనాథ్ కమ్మ కత్తితో నరికి హత్య చేశాడు. ఈఘటన స్థానికంగా  కలకలం రేపింది. హత్యకు సంబంధించిన వివరాలు పోలీసులు వెల్లడించాల్సి ఉంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని బిచ్కుంద ఎస్సై మోహన్ రెడ్డి తెలియజేశారు.