Batukammanews
Newspaper Banner
Date of Publish : 17 February 2025, 5:42 pm Posted by : ramakrishna

నగర యువకుడి దారుణ హత్య ?

  •  రెండు రోజుల క్రితం మిస్సింగ్
  • ఇందల్వాయి అటవీ ప్రాంతంలో కాలిపోయిన స్థితిలో మృతదేహం

 

నిజామాబాద్ క్రైo, బతుకమ్మ : నిజామాబాద్ నగరంలోని ఐదో టౌన్ పరిధిలోని నాగారం చెందిన యువకుడు దారుణ హత్యకు గురయ్యారు. ఈ సంఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. నాగారంలోని 300 క్వార్టర్స్ బీడీ వర్కర్స్ కాలనీ సమీపంలోని 33 సంవత్సరాల యువకుడు ఈనెల 15న ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. అతని భార్య స్థానిక ఐదోవ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. సోమవారం ఇందల్వాయి అటవీ ప్రాంతంలో ఓ యువకుడి కాలిన స్థితిలో మృతదేహం లభ్యమయింది. పోలీసులు జిల్లాలో మిస్సింగ్ కేసులను పరిశీలించారు ఈ పరిశీలనలో రెండు రోజుల క్రితం మిస్సింగ్ అయిన వ్యక్తి ఒంటిపై ఉన్న దుస్తులు ఆధారంగా చేసుకుని అతడిని నాగారంకు చెందిన యువకుడిగానే గుర్తించారు. రెండు రోజుల క్రితం కేబుల్ ఆపరేటర్ టెక్నీషియన్ గా పనిచేసిన యువకుడిని అతని సన్నిహితులే ఆటోలో తీసుకువెళ్లినట్టు గుర్తించారు. వారే యువకుడిని హత్య చేసి ఆనవాళ్లు దొరక్కుండా ఉండేందుకు దహనం చేశారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. యువకుడి హత్య గల కారణాలను పరిశోధిస్తున్నారు.

Brutal murder of a city youth?