Batukammanews
Newspaper Banner
Date of Publish : 06 May 2025, 10:49 am Posted by : ramakrishna

బీజేపీ మహిళా నాయకురాలి దారుణ హత్య

తమిళనాడులో తల నరికేసిన దుండగులు

వెబ్ న్యూస్, బతుకమ్మ : తమిళనాడులో బీజేపీ మహిళా నాయకురాలి దారుణ హత్య సంచలనంగా మారింది. దుండగులు అత్యంత కిరాతకంగా ఆమె తల నరికి హత్య చేశారు. ఈహత్య తో ఒక్కసారిగా  తమిళనాడు ఉలిక్కిపడింది. మధురై సెంట్రల్ నియోజకవర్గం బీజేపీ మహిళ నాయకురాలిగా శరణ్య కొనసాగుతోంది. శరణ్య గత రాత్రి ఇంటికి వెళ్తుండగా వెంటాడిన దుండుగులు తల నరికి చంపారు.  గతేడాది మధురై పర్యటన సమయంలో మంత్రి పళబివేల్ త్యాగరాజన్ కారుమీద శరణ్య చెప్పులు  విసిరింది. ఈకేసులో శరణ్య సహా పలు బీజేపీ నేతలు అరెస్టు అయ్యారు. రాజకీయ కక్షలతో హత్య జరిగిందా లేక వ్యక్తిగత గొడవల కారణంగా ఈఘాతుకానికి పాల్పడ్డారా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.