Batukammanews
Newspaper Banner
Date of Publish : 08 December 2025, 1:11 pm Posted by : ramakrishna

జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ హత్య

హైదరాబాద్, బతుకమ్మ:  హైదరాబాద్‌లో  దారుణ హత్య జరిగింది. మల్కాజ్ గిరి పరిధిలోని జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాప్రా ప్రాంతం సాకేత్ కాలనీలో రియల్ ఎస్టేట్ వ్యాపారి వెంకట రత్నం(54) అనే వ్యక్తిని దుండగులు దారుణంగా హతమార్చారు. స్కూటీపై వెళ్తున్న వెంకట రత్నంను వెంబండించి  గన్‌తో కాల్పులు జరిపి, కత్తులతో దాడి చేసి కిరాతకంగా హత్య చేశారు.  స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకుని పోలీసులు  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.కాగా, ఈహత్యకు ఆర్థిక లావాదేవీలు కారణమని పోలీసులు భావిస్తున్నారు.