Batukammanews
Newspaper Banner
Date of Publish : 09 August 2025, 3:58 pm Posted by : ramakrishna

గుర్తు తెలియని వ్యక్తి దారుణ హత్య

 

. . . జాతీయ రహదారి ప్రక్కన వెలుగులోకి వచ్చిన హత్య

. . . తలపై బండరాళ్లు వేసి హత్యకు పాల్పడిన అగంతకులు

 నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :Brutal murder by an unidentified person

గుర్తు తెలియని వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన శనివారం ఉదయం ఇందల్వాయి మండలం చంద్రాయన్ పల్లి శివారులో జాతీయ రహదారి పక్కన వెలుగు చూసింది. డిచ్ పల్లి సీఐ కథనం ప్రకారం  గుర్తు తెలియని వ్యక్తి తలపై అగంతకులు బండరాయితో మోది హత్య చేశారు. ఈ ఘటన జరిగి మూడు నుంచి నాలుగు రోజులు గడిచి ఉంటుందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. శవం కొద్దిగా కుళ్లిపోయి ఉండి శవం పై నేవీ బ్లూ కలర్ ప్యాంటు, వైట్ బనియన్, వైట్ అండ్ బ్రౌన్ చెక్స్ గల షర్టు, బ్రౌన్ కలర్ బెల్ట్ దీనిపై డాలర్ గుర్తుగల బక్కెలు, ఎడమ కాలికి నల్ల దారం ఉంది ఎవరైనా శవమును గుర్తుపట్టిన యెడల ఇందల్వాయి పోలీస్ వారికి సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.