- బీఆర్ఎస్వీ ప్రధాన కార్యదర్శి మధుకర్ రెడ్డి
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : బీఆర్ఎస్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్ లో ఏపీలో నిర్మించే బనకచర్ల ప్రాజెక్టు వల్ల తెలంగాణ కు జరుగుతున్న అన్యాయం పై రాష్ట్ర సదస్సు నిర్వహిస్తున్నట్లు బీఆర్ఎస్వీ ప్రధాన కార్యదర్శి మధుకర్ రెడ్డి తెలిపారు. ఈ సదస్సును విజయవంతం చేయాలని ప్రతి కళాశాలలో బనకచర్ల ప్రాజెక్టు వలన జరిగే నష్ట ల గురించి వివరిస్తూ కర పత్రాలను పంపిణీ చేసినట్లు తెలిపారు. ఈ సదస్సు కు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్,మాజీ మంత్రులు హరీష్ రావు, జగదీశ్వర్ రెడ్డి హాజరుతారని పేర్కొన్నారు. విద్యార్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు నవకిశోర్, భాస్కర్, నితిన్, శషా0క్, చింటూ, తదితరులు పాల్గొన్నారు.