Batukammanews
Newspaper Banner
Date of Publish : 18 December 2024, 8:38 pm Posted by : ramakrishna

బీఆర్ఎస్ యూత్ ప్రెసిడెంట్ కాంగ్రెస్ లో చేరిక 

భీమ్ గల్, బతుకమ్మ : భీంగల్ మండల కేంద్రానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ యూత్ టౌన్ ప్రెసిడెంట్ నీలం రవి బుధవారం కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకొన్నారు. ఆయన తో పాటు బీఆర్ఎస్ యూత్ నాయకులు నరేష్, రాజు, సీహెచ్ రాకేష్, బిట్టు,సురేష్, మహేష్, మజ్జు, అక్రంలు బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది.ఈ సందర్బంగా సునీల్ కుమార్ వీరికి పార్టీ ఖండ్వా కప్పి పార్టీలోకి సధారంగా ఆహ్వానించారు. ఈ సందర్బంగా నీలం రవి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలొ జరుగుతున్న ప్రజాపాలనకు ఆకర్షితులమై ప్రజాపాలనలో, ప్రజా సేవలో భాగస్వాములం కావడానికి కాంగ్రెస్ పార్టిలో చేరడం జరిగిందన్నారు. రాష్ట్రంలో ప్రజలు మెచ్చిన పాలన ప్రజల ఆకాంక్ష మేరకు పరిపాలన జరుగుతుందని, భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడానికి కృషి చేస్తానని తెలిపారు.  కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బోదిరె స్వామి,మాజీ ఎంపీపీ కన్నె సురేందర్,టౌన్ అధ్యక్షుడు జె జె నర్సయ్య,మల్లెల లక్ష్మణ్, అనంతరావ్, విక్రమ్, సాయిబాబా,పల్లె శేఖర్, కోరాడి లింబాద్రి, పొల్సాని రంజిత్,కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.