నగరంలో ధర్నా చౌక్ లో బీఆర్ఎస్ మహిళా నేతల ధర్నా

  నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   అసెంబ్లీ ఆవరణలో మహిళా ఎమ్మెల్యేలు  సునీతా లక్ష్మారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి లపై జరిగిన దాడిని నిరసిస్తూ మంగళవారం నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే  గణేష్ బిగాల ఆధ్వర్యంలో   ధర్నా చౌక్‌లో బీఆర్ఎస్ మహిళా నాయకులు, కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ ప్రజాస్వామ్యానికి నిలయమైన అసెంబ్లీ ఆవరణలో మహిళా ప్రజాప్రతినిధులపై దాడి జరగడం తీవ్రంగా ఖండించాల్సిన విషయమన్నారు. ప్రజల తరఫున ప్రశ్నించే ప్రతిపక్ష ఎమ్మెల్యేలపై దాడులు చేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని...