నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
అసెంబ్లీ ఆవరణలో మహిళా ఎమ్మెల్యేలు సునీతా లక్ష్మారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి లపై జరిగిన దాడిని నిరసిస్తూ మంగళవారం నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల ఆధ్వర్యంలో ధర్నా చౌక్‌లో బీఆర్ఎస్ మహిళా నాయకులు, కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ ప్రజాస్వామ్యానికి నిలయమైన అసెంబ్లీ ఆవరణలో మహిళా ప్రజాప్రతినిధులపై దాడి జరగడం తీవ్రంగా ఖండించాల్సిన విషయమన్నారు. ప్రజల తరఫున ప్రశ్నించే ప్రతిపక్ష ఎమ్మెల్యేలపై దాడులు చేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని పేర్కొన్నారు.మహిళా ఎమ్మెల్యేలపై దాడికి బాధ్యులైన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.మహిళా ప్రజాప్రతినిధులకు రక్షణ కల్పించాలి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి అంటూ నినాదాలు చేస్తూ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ దండు నీతుకిరణ్, మాజీ కార్పొరేటర్లు విశాలిని రెడ్డి, సిర్ప సువర్ణ, మంజుల యాదవ్,చింతకాయల అలేఖ్య,గంగ ,సంధ్య తదితరులు తదితరులు పాల్గొన్నారు.