Batukammanews
Newspaper Banner
Date of Publish : 08 November 2025, 6:27 pm Posted by : ramakrishna

జూబ్లీహిల్స్ గెలుపు వాకిట బీఆర్ఎస్

  • బీఆర్ఎస్ లీగల్ సెల్ కన్వీనర్ దాదన్నగారి మధుసుధన్ రావు

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : తెలంగాణ రాష్ట్ర హైదరాబాద్ లో ని జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గంలో భారాస అభ్యర్థిని మాగంటి సునీత దే విజయమని నిజామాబాద్ భారత రాష్ట్ర సమితి లీగల్ సెల్ కన్వీనర్ దాదన్నగారి మధుసుధన్ రావు ఒక ప్రకటనలో తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నాయకుల మాటలు, ప్రచారశైలి వారి ముందస్తు ఓటమిని తేటతేల్లం చేసిందని ఆయన అన్నారు. హైదరాబాద్ ను అన్ని రంగాలలో ప్రగతిపథాన నడిపిన కేసీఆర్ కు కానుకగా జూబ్లీహిల్స్ గెలుపును ఓటర్లు ఇవ్వబోతున్నారని ఆయన పేర్కొన్నారు. ఆరు గ్యారంటీలు అంటు అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి జూబ్లీహిల్స్ ప్రజలు గుణపాఠం చెప్పబోతున్నారని అన్నారు. జూబ్లీహిల్స్ లోని ఓటర్లను తెలంగాణ సమాజం మరింత ప్రేరణ కలిగించి భారాసకు అత్యధిక మెజారిటీ వచ్చే విదంగా తోడ్పాటు అందించాలని మధుసుదన్ రావు కోరారు. భారాస కు విజయాన్ని చేకూర్చబోతున్నమనే ప్రజల నాడిని వేగుల ద్వారా తెలుసుకున్న కాంగ్రెస్ ఒక రకమైన భయంలోకి జారుకున్నదని ఆయన పేర్కొన్నారు. ఓటమి భయం పట్టుకున్న కాంగ్రెస్ నేతలు రకరకాల విచిత్రవిన్యాశాలకు పాల్పడుతున్నారని, వాటిని జూబ్లీహిల్స్ ప్రజానీకం తిప్పికొట్టి భారత రాష్ట్ర సమితి కి పట్టం కట్టబోతున్నారని మధుసుధన్ రావు తెలియజేశారు.